amp pages | Sakshi

వడ్డీ రాయితీ కొనసాగింపు

Published on Thu, 06/15/2017 - 01:27

రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక పంట రుణాలకు 7 శాతం వడ్డీ ∙ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం
న్యూఢిల్లీ: స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసా గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకూ రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం(3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది.

ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు.

2006–07 నుంచి వడ్డీ రాయితీ
వడ్డీ రాయితీ పథకాన్ని 2006–07 నుంచి అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సంలో కూడా దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. పథకాన్ని నాబార్డు, రిజర్వ్‌ బ్యాంకు అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక రుణాలకు 2 శాతం వడ్డీ సబ్సిడీని ఇస్తూ 7 శాతం వడ్డీకే రుణాలను అందజేస్తోంది. దీనికి అదనంగా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. దీంతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులు 4 శాతం వడ్డీకే రుణాలు పొందుతున్నారు. ఈ రుణాలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందజేస్తున్నాయి.

Videos

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)