amp pages | Sakshi

చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్‌ పెళ్లి

Published on Sun, 01/27/2019 - 19:23

అహ్మదాబాద్‌: పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్‌ పారిక్‌ను ఆదివారం వివాహం చేసుకున్నారు. సురేంద్రనగర్‌ జిల్లా దిగ్సార్‌ గ్రామంలోని ఓ దేవాలయంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పటేల్‌ సంప్రాదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం హార్ధిక్‌ మాట్లాడుతూ.. ‘నా కుటుంబ జీవితంలో ఇది రెండో ఇన్నింగ్స్‌. ప్రతి ఒక్కరు సమాన అవకాశాలు పొందాలనేదే నా కోరిక. పురుషులకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని.. నేను నా భార్యకు ప్రామిస్‌ చేశాను. ఇకపై మేమిద్దరం ఈ దేశ నవ నిర్మాణం కోసం పోరాడతామ’ని తెలిపారు.

కింజాల్‌, తాను ప్రేమించుకున్న విషయాన్ని హార్ధిక్‌ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలుత కింజల్‌ తనకు ప్రపోజ్‌ చేసిందన్న హార్ధిక్‌.. పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. హార్ధిక్‌ స్వగ్రామం అహ్మదాబాద్‌ జిల్లాలోని చందన్‌ నగరి కాగా, కింజల్‌ ఆ ఊరికి సమీపంలోని విరంగం గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం కింజల్‌ కుటుంబం సూరత్‌లో నివాసం ఉంటుంది. ఆమె తంద్రి దిలీప్‌ పారిక్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన కింజల్‌.. ప్రస్తుతం లా చదువుతున్నారు. 

Videos

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌