వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
హ్యాట్సాఫ్.. నరేంద్ర మోదీ!
Published on Wed, 11/09/2016 - 09:15
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని సినిమా ప్రముఖులు స్వాగతించారు. మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. పెద్ద నోట్ల రద్దుపై తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
-
ప్రధాని నరేంద్ర మోదీకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జేజేలు పలికారు. నవీన భారత్ ఆవిర్భవించిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
-
తన తాజా చిత్రం ’పింక్’ కారణంగానే కొత్త 2 వేల రూపాయల నోటును పింక్ రంగులో ముద్రిస్తున్నారని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చమత్కరించారు.
-
నల్లధనం దాచినవారు బయటపడక తప్పదని సీనియర్ నటుడు పరేశ రావల్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రూ. 500, రూ.1000 నోట్లు బయటపెట్టక తప్పదని అన్నారు.
-
సంచలనాత్మన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి దర్శకనిర్మాత మధుర్ భండార్కర్ అభినందనలు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్లధనం వెలికి వస్తుందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
-
9/11 రోజున కొంత మంది ఓడిపోతారు. కానీ చాలా మంది గెలుస్తారు. ప్రధాని మోదీ శక్తివంతమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నార’ని బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి పేర్కొన్నారు.
-
ఈ మార్పును మనమంతా సహృదయంతో స్వాగతించాలి. ప్రతి పౌరుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని హీరో అర్జున్ కపూర్ అన్నాడు.
-
దేశ నిర్మాణం కోసం ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు హీరోయిన్ అనుష్క శర్మ తెలిపింది. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అందరూ సహరించాలని కోరింది.
Hats off @narendramodi ji. New india is born #JaiHind— Rajinikanth (@superstarrajini) 8 November 2016
T 2435 - the new 2000 rs note is PINK in colour ... the PINK effect ..!!
— Amitabh Bachchan (@SrBachchan) 8 November 20169/11 jab bhi aata hai hila dalta hai bhai...this 9/11 some will lose...many shall win! A powerful & brave decision indeed #RIP #BlackMoney
— Suniel Shetty (@SunielVShetty) 8 November 2016Congratulations to @PMOIndia @narendramodi for this bold move to ban 500 and 1000 notes to counter #BlackMoney and strengthen our economy.
— Madhur Bhandarkar (@imbhandarkar) 8 November 2016A welcome bold&courageous step by PM Modiji towards nation building.Each 1of us shld cooperate in d larger interest of d nation #BlackMoney
— Anushka Sharma (@AnushkaSharma) 8 November 2016
Tags