amp pages | Sakshi

చరిత్ర తప్పుగా అంచనావేయదు

Published on Sun, 10/28/2018 - 04:38

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ను చరిత్ర తప్పుగా అంచనావేయదని ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అన్నారు. మన్మోహన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్‌లో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్‌ పాత్రను అనుపమ్‌ ఖేరే పోషించారు. తొలుత మన్మోహన్‌ను తానూ తప్పుగా అంచనావేశానని, కానీ ఏడాదిపాటు ఆయన రీలు లైఫ్‌లో జీవించాక తన దృక్పథం పూర్తిగా మారిందన్నారు. మన్మోహన్‌ ఈ చిత్రాన్ని తిలకించిన తరువాత ఆయనతో కలసి టీ తాగేందుకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్పారు. ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ చిత్రీకరణ ముగిసింది. ఆయన్ని చరిత్ర తప్పుగా అంచనావేయదు’ అని ఖేర్‌ అన్నారు. యూపీఏ–1లో మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానె బెర్నర్ట్‌ పోషించారు. ఈ సినిమాకు విజయ్‌ రత్నాకర్‌ గుట్టె దర్శకుడు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?