amp pages | Sakshi

8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు

Published on Tue, 05/19/2020 - 04:16

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్‌ సోమవారం ఐదోసారి సవరించిన గైడ్‌లైన్స్‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్లకు విధిగా ఆర్‌టీ–పీసీఆర్‌ (రియల్‌ టైమ్‌ పల్మనరీ చైన్‌ రియాక్షన్‌) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.  

8 కేటగిరీల్లో ఎవరెవరు?   
► ఐఎల్‌ఐ (ఫ్లూ లక్షణాలు ఉన్న) వాళ్లకు.. వ్యక్తిగతంగా గానీ, అంతర్జాతీయ ప్రయాణం చేసిన వారికి(14 రోజుల్లో).  

► కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్‌ అయిన ఐఎల్‌ఐ లక్షణాలు ఉన్నవారికి.  

► ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఐఎల్‌ఐ లక్షణాలున్న వారు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సంబంధం ఉన్నవారు.  

► తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌(సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌)తో బాధపడుతున్నవారు.  

► ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా(అసింప్టమాటిక్‌) హైరిస్క్‌ పాజిటివ్‌ కేసులతో సంబంధం ఉన్నవారు లేదా టెస్టు చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్‌ అయినవారు. æ హాట్‌స్పాట్లు,  కంటైన్మెంట్‌ జోన్లలో వైరస్‌ లక్షణాలున్న అందరికీ.  

► ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి.  

► ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి.  æ కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)