amp pages | Sakshi

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

Published on Sat, 07/13/2019 - 03:08

ఢిల్లీ: భారత్‌లో దశాబ్ద కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బహుపార్శ్వపు పేదరిక సూచిక (మల్టీడైమన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ – ఎంపీఐ) వెల్లడించింది. యూఎన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ కలసి రూపొందించిన ఈ సూచిక తాలూకూ నివేదిక ప్రకారం – మన దేశం వేగంగా పేదరికాన్ని తగ్గించగలుగుతోంది. జార్ఖండ్‌ వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో పదేళ్ల(2005–6, 2015–16)కాలంలో పేదరికం 46.5 శాతం మేరకు తగ్గింది. ఇండియా, ఇథియోపియా, పెరూ దేశాలు పేదరికాన్ని తగ్గించడంలో చెప్పుకోదగిన రీతిలో ముందున్నాయి. 101 దేశాల సూచికలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో 31 స్వల్పాదాయ దేశాలు, 68 మధ్యాదాయ దేశాలు. ఆయా దేశాల్లో 130 కోట్ల మంది బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికాన్ని, అది ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలనేది ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది. నివేదిక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 200 కోట్ల జనాభా గల 10 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతి, నైజీరియా, పాకిస్తాన్, పెరు, వియత్నాం) దశాబ్ది కాలంలో ఈ లక్ష్య సాధన దిశగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయని వెల్లడించింది. పై పది దేశాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు మరింత పేదరికం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు