amp pages | Sakshi

ఆన్‌లైన్‌ బదిలీలకు మొబైల్ గండం!

Published on Mon, 12/12/2016 - 16:19

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత బదిలీల కార్యక్రమం ఓ తరంగంలా అనూహ్యంగా దూసుకొచ్చిన నేపథ్యంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ వ్యాలెట్స్‌, ఆన్‌ లైన్‌ పేమెంట్స్‌ నేపథ్యంలో మొబైల్‌ ద్వారా జరిగే మోసాలు పెరిగేపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమస్య 2017నాటికి 60 నుంచి 65శాతానికి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అసోచామ్‌, ఈవై అనే ఓ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించి ‘సైబర్‌ నేరాలు తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహాలు’ అనే పేరిట ఒక నివేదికను విడుదల చేసింది.

ప్రతి ప్రాంతంలో ఎలాంటి లావాదేవీ ఆగకుండా, ఏం కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలని, సైబర్‌ నేరాలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ ప్రస్తుతం 40 నుంచి 45శాతం ఆయా కంపెనీలకు చెందిన ఆర్థిక లావాదేవీలు మొబైల్‌ ద్వారా జరిగే మోసాలను ఎదుర్కొంటున్నాయి. ఇవి త్వరలోనే 60 నుంచి 65శాతానికి పెరుగుతాయి.

ఇప్పటి వరకు జరిగిన సైబర్‌నేరాల్లో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని, ఇవి గతంతో పోలిస్తే గడిచిన మూడేళ్లలో ఆరింతలు పెరిగాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విడివిడిగా చూసినప్పుడు 46శాతం ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులవి ఉన్నాయని, ఫేస్‌ బుక్‌కు సంబంధించిన సైబర్‌ నేరాలు 36శాతం, మొబైల్‌ ద్వారా 21శాతం, ఈమెయిల్ ఐడీ హ్యాకింగ్‌ మోసాలు 18శాతం, అభ్యంతర ఫోన్‌ కాల్స్‌, మెస్సేజెస్‌ మోసాలు 12శాతం ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)