amp pages | Sakshi

ఒక్క రోజు బ్రిటిష్‌ హై కమిషనర్‌గా భారత విద్యార్థిని

Published on Tue, 10/09/2018 - 13:19

న్యూఢిల్లీ : ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఒక్క రోజు సీఎంగా విధులు నిర్వర్తిస్తాడు. ఆ సీన్‌ దాదాపు అందరికి గుర్తుండేఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ గా పాటు విధులు నిర్వర్తించింది. ఆమె పేరు ఈషా బహల్‌.

ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలోని కోర్సు చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదెలా అంటారా..

అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టొబర్‌ 11) పురస్కరించుకొని  బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించారు. మీ దృష్టిలో లింగ సమానత్వానికి అర్థం ఏమిటి.. అనే ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న వీడియో రూపొందించాలని పంపాలని ప్రకటించింది. 

అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.ఈషాతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు. కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది. 

 దీనిపై ఈషా మాట్లాడుతూ..‘ బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక అరుదైన అనుభూతి. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది.

ఇక వాస్తవ భారత బ్రిటీష్ హైకమిషనర్  డొమినిక్ ఆస్కిత్ మాట్లాడుతూ.. భారత మహిళ హక్కుల చర్చకు ఈ పోటీ ఓ వెదికగా ఉందని నమ్ముతున్నారు. విద్యార్థినీలు పంపిన వీడియోలు చాలా బాగున్నాయి. ఈషా పంపిన వీడియో ఆకర్షనీయంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ఆ వీడియో బాలిక హక్కుల గురించి చక్కగా వివరించింది. ఒక్కరోజు బ్రిటిష్‌ హై కమిషనర్‌గా ఎన్నికైన ఈషాకి శుభాకాంక్షలు’  అని పేర్కొన్నారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)