amp pages | Sakshi

మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!

Published on Mon, 02/22/2016 - 16:19

భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు.  ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు.

అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు.

వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు.

ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు  బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని,  మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)