amp pages | Sakshi

ఏపీ కాదంది.. ముక్కలుకానున్న యుద్ధనౌక

Published on Tue, 02/21/2017 - 15:33

న్యూఢిల్లీ: స్వతంత్ర భారత్‌ మొదటి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు జరిగిందే బ్రిటిష్‌ ఇండియాకు చెందిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు కూడా జరగబోతుందా?. నేవీకి 30 ఏళ్ల పాటు సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను భారత ప్రభుత్వం ముక్కలుగా విడగొట్టాలనే యోచనలో ఉంది. వచ్చే నెల 6వ తేదీన సర్వీసు నుంచి రిటైర్‌కానున్న విరాట్‌ బ్రిటిష్‌ ఇండియాకు 27 ఏళ్ల పాటు సేవలందించింది. ఆ తర్వాత 1987లో భారత నేవీలో చేరింది.

రిటైర్మెంట్‌ తర్వాత విరాట్‌ను మ్యూజియంగా మార్చే అవకాశాలను తొలుత కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. అందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. విరాట్‌ను 13 అంతస్తుల మ్యూజియంగా మార్చేందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతాయి. ఈ విషయాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్ల వరకూ తాము భరించగలమని మిగతా కేంద్రమే భరించాలని కోరింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్ధనను తోసిపుచ్చిన కేంద్రం సాంకేతికంగా అవసరమైతే సాయం చేస్తామని, నిధుల సాయమైతే కష్టమే అనే సంకేతాలు పంపింది. దీంతో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది.

విక్రాంత్‌ రిటైర్మెంట్‌ అనంతరం 17 సంవత్సరాల పాటు మెయింటైన్‌ చేసిన భారత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు అవుతుండటంతో భాగాలను విడగొట్టేందుకు అమ్మేసింది. మార్చి 6వ తేదీన ముంబై పోర్టులో భారతీయ నేవీ విరాట్‌కు విడ్కోలు పలకనుంది. ఈ కార్యక్రమానికి విరాట్‌ మొదటి కమాండర్‌తో పాటు విరాట్‌లో పనిచేసిన బ్రిటన్‌కు చెందిన పలువురు వెటరన్లు, నేవీ అడ్మిరల్‌ సునీల్ లాంబా, నేవీ అధికారులు హాజరుకానున్నట్లు తెలిసింది. విరాట్‌ తన కెరీర్లో ఐదు లక్షల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)