amp pages | Sakshi

ఒక టాపర్ కథ

Published on Fri, 05/29/2015 - 10:01

'నిన్ను చదివించే  స్తోమత మాకు లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. వెంటనే ఇంటికి బయలుదేరు. పెళ్లి సంబంధం చూశా. కుర్రాడు మనలాగే ఇటుకల బట్టీలో కూలీ.  ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పదపద....' సరిగ్గా మూడు నెలల క్రితం మహేన్ రాయ్.. తన కూతురు స్వప్న రాయ్తో అన్న మాటలివి.

 

అనుకున్నట్టే పెళ్లి చేసేందుకు కూతుర్ని వెంటబెట్టుకుని అతను తన గుడిసెకు చేరుకున్నాడు . పశ్చిమ బెంగాల్లోని నార్త్ దినాజ్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్న గ్రామం వాళ్లది. అప్పటికి స్వప్న వయసు 16 ఏళ్లు. ఇంకో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు.

అయితే స్వప్న మనసంతా చదువుపైనే. ఉన్నత చదువులతో ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నా, చెల్లిని బాగా చూసుకోవాలనుకునేది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పింది. 'బేటీ పడావో' అవసరం తెలియని నిరక్షరాస్యులు వాళ్లు. సహజంగానే తల్లిదండ్రులు 'చదువొద్దు.. పెళ్లే ముద్దు' అన్నారు. చదువు తప్ప స్వప్నకు మరోదారి కనిపించలేదు. దాంతో పోరాటానికి సిద్ధమైంది. దినాజ్ పూర్ జిల్లా కేంద్రంలో తాను చదువుతోన్న స్కూల్ టీచర్లకు గోడు చెప్పుకుంది.

రంగంలోకి దిగిన టీచర్లు.. ప్రభుత్వాధికారుల సహాయంతో ఆ బాల్య వివాహ ఒప్పందాన్ని రద్దు చేయించారు. అంతేకాకుండా బెంగాల్ ప్రభుత్వ పథకమైన గీతాంజలి ఆవాస్ యోజన కింద ఓ ఇట్టు కట్టించి, స్వప్న కుటుంబానికి  ప్రభుత్వాధికారులు ఆర్థిక సాయం కూడా అందించారు. దాంతో స్వప్న మళ్లీ స్కూలుకు వెళ్లింది.

ఇటీవలే ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 92 శాతం మార్కులు సాధించిన స్వప్న స్కూల్ టాపర్గా నిలిచింది. లెక్కల్లో 99, ఫిజిక్స్లో వందకు వంద, లైఫ్ సైన్స్లో 97, హిస్టరీలో 91, జాగ్రఫీలో 93, ఇంగ్లీష్లో 76, బెంగాలీలో 92 మార్కులు సాధించి ఔరా అనిపించింది. స్వప్న తండ్రి మహేన్ రాయ్ ఇప్పుడేమంటున్నాడో చూడండి..

'నిజంగా నేనెంత పొరపాటు చేశాను. చదువుకుంటానని నా కూతురు ఎంత అరిచినా వినిపించుకోలేదు. అధికాలు వచ్చి పెళ్లి వద్దన్నప్పుడు కోపమొచ్చింది కూడా. నా బిడ్డ ఇంత బాగా చదవగలదని, ఫస్ట్ వస్తుందని నేను ఊహించలేదు. రెండో కూతురు ప్రస్తుతం వేరొక హాస్టల్లో చదువుతోంది. కష్టమైనా సరే నా కూతుళ్ల చదువుల కోసం రక్తం ధారపోస్తా' అని సంతోషంగా తెలిపాడు.

'నాకు హ్యుమానిటీస్ సబ్జెక్టులో చేరాలని ఉంది. ఆ తర్వాత మంచి యూనివర్సిటీలో డిగ్రీ సాధించి టీచర్ కావాలన్నది నా ఆశయం. సైన్స్ గ్రూప్ చదవడానికి నాకు అన్ని అర్హతలున్నాయి. కానీ మా ఆర్థిక  స్తోమత అంతంతే. అందుకే ఆర్ట్స్ గ్రూపులో చేరదామనుకుంటున్నా. అదైతే తక్కువ ఖర్చుతో చదివెయ్యొచ్చు' అంటూ తన కలల్ని పంచుకుంది టాపర్ స్వప్న రాయ్.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)