amp pages | Sakshi

సీఎం అత్యాచారం చేశారు; జోక్యం చేసుకోలేం!

Published on Fri, 03/15/2019 - 19:51

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2008లో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ రంజన్‌ గొగోయ్‌, దీపక్‌ మిశ్రా, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాలని, అదే విధంగా రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాలని సూచించింది. కాగా సీఎంకు వ్యతిరేకంగా తాను చేసిన ఫిర్యాదును చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌, పోలీసులు స్వీకరించినందువల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించానని సదరు మహిళ పేర్కొన్నారు.

పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం..
తాను మైనర్‌గా ఉన్న సమయంలో సీఎం పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘15 ఏళ్ల వయస్సులో నాపై నలుగురు వ్యక్తులు నాపై అత్యాచారం చేశారు. అప్పుడు నేను పబ్లిక్‌ కాల్‌ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మి ఓ రోజు కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఇక తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ 2018లో జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

వ్యవస్థలపై నమ్మకం పోతుంది..
‘ అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులపై నేను ఫిర్యాదు చేశాను. కోర్టు నుంచి గానీ, పోలీసుల నుంచి గానీ సరైన స్పందన రావడం లేదు. అందరూ కూడా నన్నో మోసగత్తెగా చూస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం అంటున్నారు. ఇక్కడ కూడా నాకు న్యాయం దొరక్కపోతే, నాలాంటి ఎంతో మంది బాధితులకు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోతుంది అని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలను సీఎం పెమా ఖండు ఖండించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని కొట్టిపారేశారు.

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?