amp pages | Sakshi

శనివారం స్కూల్‌ బ్యాగ్‌లకు ‘సెలవు’

Published on Sat, 05/13/2017 - 11:42

లక్నో : పాలనలో దూసుకెళుతున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బండెడు పుస్తకాలు వీపుకు తగిలించుకుని బడికి వెళ్లే  విద్యార్థులకు యూపీ సర్కార్‌ తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది తీపి కబురే. ప్రతి శనివారం ఇక స్కూల్‌ బ్యాగ్‌లకు విద్యార్థులు ’టాటా’ చెప్పనున్నారు. ప్రయిమరీ, సెకండరీ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి శనివారం ’నో బ్యాగ్‌ డే’ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 

ఆ రోజు చదువును పక్కనపెట్టి.. విద్యార్థులకు కేవలం సంతోషకరమైన కార్యక్రమాలను మాత్రమే పాఠశాలల్లో నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహనతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దినేశ్‌ శర్మ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అలాగే ఈ విధానాన్ని కో ఎడ్యుకేషన్‌ స్కూళ్లలోనూ అమలు చేయనున్నారు. కాగా ఇకనుంచి జనాభా లెక్కలు, ఎన్నికల విధుల నిర్వహణకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌