amp pages | Sakshi

ఇక ఫేస్ బుక్ లోనే డాక్టర్!

Published on Mon, 05/02/2016 - 20:29

న్యూఢిల్లీ: ఇకపై డాక్టర్ ను సంప్రదించాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్స్ వృధా చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఫేస్ బుక్ మెసెంజర్ లో ఒక్క మెసేజ్ పెడితే చాలు. ఆన్ లైన్లోనే ఆరోగ్య సమస్యపై డాక్టర్ల సలహాలు తీసుకోవచ్చు.  భారత్ లో ఈ సదవకాశాన్ని కొత్తగా సోషల్ మీడియా దిగ్గజం  ఫేస్ బుక్ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఆన్ లైన్లో డాక్టర్లను సంప్రదించే ఈ ప్రత్యేక అవకాశాన్ని  లైబ్రేట్స్.. మొదటిసారి లైబ్రేట్ బాట్ పేరిట రానుంది. 

ఫేస్ బుక్ లైబ్రేట్ బాట్ అనేది మెసెంజర్ ఛాట్ లిస్టులో మాములూ కాంటాక్ట్  లాగే కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలను, అనుమానాలను డాక్టర్లను అడిగి నివృత్తి చేసుకునేందుకు ఈ బాట్ చక్కగా సహకరిస్తుంది. అయితే ఇందులో వినియోగదారులు  అడిగిన విషయాలనుబట్టి సమాధానం వచ్చేందుకు సమయం పడుతుంది. ఈ బాట్ ను యూజర్లు తమ తమ మెసెంజెర్ ఖాతాలో ఉచితంగానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత  http://m.me/lybrate లింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

లైబ్రేట్ బాట్ మెసెంజర్ లో హెల్త్ క్విజ్ కూడా ఉంటుంది. దీనిద్వారా ప్రజలు పెద్దగా పట్టించుకోని, అనేక రకాల సాధారణ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక లైబ్రేట్ మొబైల్‌ యాప్ రూపంలోనూ అందుబాటులోకి వస్తోంది. దీనిద్వారా 50 మంది స్పెషలిస్టులతో సహా సుమారు లక్షమంది వరకూ డాక్టర్లు దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంటారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌