amp pages | Sakshi

ఉత్తరాఖండ్ ఖర్చులకు ఆర్డినెన్స్

Published on Sat, 04/02/2016 - 02:55

జారీ చేసిన కేంద్రం
 
 డెహ్రాడూన్: ఏప్రిల్ 1 నుంచి  ఉత్తరాఖండ్ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ ద్రవ్య వినిమయ బిల్లు(ఓటాన్ అకౌంట్)కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గురువారం రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీఅయ్యాయి. పార్లమెంట్ సెషన్స్ లేకపోవడంతో... ఉత్తరాఖండ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంపై రాష్ట్రపతి సంతృప్తి చెందారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 2016-17 సంవత్సరానికి ఖర్చుల కోసం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర సంచిత నిధి నుంచి నిధులు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ ఖర్చుల కోసం రూ. 13,642.43 కోట్లు ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.  కాగా, కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 5లోగా స్పందించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఈ నెల 6న పిటీషన్‌పై తిరిగి విచారణ కొనసాగుతుంది. పార్లమెంటును ప్రొరోగ్ చేయడాన్ని వ్యతిరేకించే పిటిషన్‌ను కూడా జత చేసేందుకు రావత్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు అనుమతినిచ్చింది.

Videos

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)