amp pages | Sakshi

‘నిర్మల్’ సాధించేదెప్పుడు?

Published on Mon, 07/07/2014 - 23:33

పింప్రి, న్యూస్‌లైన్ : పుణే జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు అనేక సంవత్సరాలుగా నిర్మల్ గ్రామాలుగా ఎంపిక కాలేకపోతున్నాయి.  స్వచ్ఛత, పర్యావరణం లాంటి అంశాలను పాటించడం తదితర ప్రాతిపదికన నిర్మల్ గ్రామ పథకానికి ఎంపిక అవుతాయి. ఇలాంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సదరు గ్రామాలకు లక్షలాది రూపాయలు పారితోషికంగా ఇస్తోంది.

 అర్హతలేని 994 గ్రామాలు
 జిల్లాలో మొత్తం 1,404 గ్రామాలుండగా, 2014 వరకు జిల్లాలోని 994 గ్రామాలు ఈ పోటీలకు కనీస అర్హత కూడా సాధించలేకపోయాయి. ఖేడ్ తాలూకాలో అత్యధికంగా 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందాపూర్ తాలూకాలో 98, జున్నార్‌లో 90, శిరూర్‌లో 78, హవేలిలో 72, ముల్షీలో 69, పురంధర్‌లో 66, భోర్‌లో 63 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలలో సరైన నీటి వసతి, డ్రైనేజీ, మరుగుదొడ్లు, చెత్త కండీలు లాంటి కనీస సదుపాయలు కూడా లేకపోవడంతో నిర్మల్ గ్రామాలకు అర్హత సాధించలేకపోయాయి.

 ఇక బారామతి తాలూకాలో 54, దౌండ్‌లో 57, వేల్హా తాలూకాలో 45 గ్రామాలదీ ఇదే దుస్థితి. భోర్ తాలూకాలో 92 గ్రామ పంచాయతీలు నిర్మల్ గ్రామాల సరసన చేరేందుకు కనీసం ప్రయత్నం చేయగా, ఇందులో 59 గ్రామాలు నిర్మల్ గ్రామాలుగా అర్హత సాధించాయి. ఖేడ్‌లో 32, బారామతి తాలూకాలో 44 గ్రామాలకు నిర్మల్ గ్రామ పురస్కారాలు అందాయి.

 తాలూకాల వారీగా.. నిర్మల్ గ్రామ పంచాయతీలు ఇవే..
 ఆంబేగావ్ 103, (40 గ్రామాలు నిర్మల్ గ్రామ పంచాయతీలుగా అర్హత సాధించాయి), బారామతి 97 (44), భోర్ 155 (59), దౌండ్ 79 (28), హవేలి 100 (28), ఇందాపూర్ 113 (13), జున్నార్ 142 (37), ఖేడ్ 163 (32), మావల్ 104 (24), ముల్షీ 95 (27), పురంధర్ 90 (27), శిరూర్ 93 (16), వేల్హే 70 (36) ఉన్నాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌