amp pages | Sakshi

'నా తండ్రి అమాయకుడు'

Published on Sat, 11/21/2015 - 12:40

ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన పీటర్ ముఖర్జియా కొడుకు, షీనా బోరా ప్రియుడు రాహుల్ స్పందించాడు. తన తండ్రి అమాయకుడనీ,  ఈ కేసుతో ఆయనకేమీ సంబంధం లేదని వ్యాఖ్యానించాడు.  తన తండ్రిపై చేసిన ఆరోపణలు దారుణమన్నాడు.   నిన్న సీబీఐ అదుపులోకి తీసుకున్న తండ్రి పీటర్ ను సీబీఐ ఆఫీసులో కలవడానికి వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశాడు.  

అయితే ఈ  కేసులో ప్రధాన ముద్దాయి, షీనాబోరా తల్లి ఇంద్రాణి శుక్రవారం మీడియాముందు నోరు విప్పింది. ఎప్పటిలాగానే తాను అమాయకురాలినని  వాదించింది.   ఈ కేసుతో పీటర్ ముఖర్జియాకు ఉన్న సంబంధంపై మాట్లాడానికి నిరాకరించింది. అటు పీటర్ కూడా  సీబీఐ ఆరోపణలను ఖండించాడు.

కాగా  సంచలనం రేపిన షీనా బోరా  హత్య కేసులో మీడియా టైకూన్,  ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జియా ను  నిందితుడుగా పేర్కొంటూ చార్జ్ షీట్ దాఖలు చేసింది.  హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర కేసు అభియోగాలను  నమోదు  చేసింది.  షీనా హత్య గురించి తెలిసినా కొడుకు రాహుల్ ను  తెలియకుండా దాచిపెట్టారన్నది సీబీఐ వాదన. మరోవైపు   ముగ్గురు  ప్రధాన నిందితుల  జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్  3 వ తేదీవరకు  పొడిగించింది సీబీఐ కోర్టు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)