amp pages | Sakshi

వీడెవడండీ బాబు.. స్పైడర్‌ మ్యానా? ఫొటోగ్రాఫరా?

Published on Fri, 04/20/2018 - 17:32

ఏదైనా పని చేపట్టినపుడు దానిమీదే దృష్టి మొత్తం కేంద్రీకరించినప్పుడు ఫలితం తొందరగా దరిచేరుతుందంటారు. అంతేకాదు మనకు నచ్చిన పనిలో ఎంత కష్టం ఉన్నా అది ఇష్టంగానే అనిపిస్తుంది. దానిపై ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకెళ్తాము. ఒక్కోసారి దాని కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనకాడం. అందుకు నిదర్శనంగా ఈ ఫొటోగ్రాఫర్‌ని చెప్పుకోవచ్చు. 

అసలు విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఫొటోలు తీయించుకోవడానికి ఓ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌కి కబురు పెట్టారు.  దీంతో ఫోటోగ్రాఫర్‌ వచ్చి నవ దంపతులకు ఫోటో షూట్‌ చేశాడు. అయితే అతను ఫొటోలు తీసే విధానం చూసి ఆ దంపతులే కాదు.. నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఆ ఫొటోగ్రాఫర్‌ వారిద్దరినీ ఓ చెట్టు కింద నిలబడమని చెప్పి అతను ఓ చెట్టు ఎక్కాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ మరీ వారి ఫొటో తీశాడు. ఆ ఫొటో కూడా చాలా చక్కగా వచ్చింది. 

ఇలా ఫొటో తీస్తున్న వీడియోను రాజబాబు అనే నెటిజన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘నేరాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పైడర్‌ మ్యాన్‌ కావాలనుకున్నప్పుడు.. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఫొటోగ్రాఫర్‌ అయితే ఇలాగే ఉంటుంది’ అని సరదాగా ట్వీట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడెవడండీ బాబు.. స్పైడర్‌ మ్యానా.? ఫొటోగ్రాఫరా.? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఫోటో షూట్‌ ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియదు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)