ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ రాష్ట్రంలో ప్రారంభమైన తొలి ఎయిర్పోర్ట్
Published on Mon, 09/24/2018 - 11:55
గ్యాంగ్‌టక్ : సిక్కిం తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పయోంగ్ వద్ద 2009లో శంకుస్ధాపన జరిగిన ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌గా దీన్నిఅభివృద్ధి చేశారు.
ఆదివారం సాయంత్రం ఎంఐ-8 విమానంలో ఇక్కడికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ గంగా ప్రసాద్, సీఎం పవన్ చామ్లింగ్ తదితరులు లివింగ్ ఆర్మీ హెలిపాడ్‌లో స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణీకులకు మిగిలిన ప్రపంచంతో కనెక్టివిటీ పెరిగేందుకు ఈ విమానాశ్రయం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
#
Tags