amp pages | Sakshi

రికార్డు స్థాయిలో అయ్యప్ప ఆదాయం

Published on Wed, 12/13/2017 - 12:58

సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే అప్పయ్య ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అదనంగా.. రూ. 15 కోట్లు వచ్చినట్లు టీడీబీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్‌ టైమ్‌ రికార్డుగా కూడా వారు చెబుతున్నారు. మండల పూజలు పూర్తయ్యే నాటికి ఆదాయం మరింత పెరుగుతుందని వారు అంటున్నారు.గత ఏడాది ఇదే సమయానికి ఆలయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయంరాగా..ఈ ఏడాది అదనంగా మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీపీ పేర్కొంది.


మొత్తం రెవెన్యూ వివరాలు
శబరిమల అప్పయ్య మొత్తం రెవన్యూ : 101, 08,80,925
అరవణ, అప్పం ప్రసాదం అమ్మకల ద్వారా : 52,63,02,745
హుండీ ఆదాయం :  35,89,26,885

భారీగా భక్తులు
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది.

నెయ్యాభిషేకం కోసం
అయ్యప్ప భక్తులు ఇరుముడి నెయ్యి కోసం మాళికాపురం ఆలయం దగ్గరి ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇరుముడి, నెయ్యిని ఇక్కడే విప్పుకోవచ్చని తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయానికి ఉత్తరాన భండారం పేరుతో మరో కాంప్లెక్స్‌ ఉందని.. అక్కడ కూడా నెయ్యాభిషేకం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?