amp pages | Sakshi

సాయంత్రంలోగా మంత్రిపదవి పీకేయండి

Published on Thu, 10/22/2015 - 15:10

ఎవరో కుక్కను రాళ్లతో కొడితే దానికి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. వీకే సింగ్ ప్రకటన చాలా సిగ్గుచేటని, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టం కింద శిక్షార్హ మని ఆయన అన్నారు. ఆయనపై వెంటనే కేసు పెట్టాలన్నారు. అసలు ఈరోజు సాయంత్రంలోగా ఆయనను మంత్రివర్గం నుంచి బయటకు లాగిపారెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించి ట్వీట్లు పెట్టారు.

ఈరోజు దసరా అని, చెడ్డతనం, అహంకారాల మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక అని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ నిజంగా దసరాను నమ్మేవాల్ఏల అయితే ఆయనకు తన మంత్రివర్గంలో ఉన్న చెడు, అహంకారం నుంచి ముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈరోజు సాయంత్రంలోగా వీకే సింగ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు పంపెయ్యాలని డిమాండ్ చేశారు.