amp pages | Sakshi

మళ్లీ వాయుసేనలోకి డకోటా

Published on Tue, 02/13/2018 - 22:53

న్యూఢిల్లీ: 1947 భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన డకోటా యుద్ధ విమానం మార్చిలో తిరిగి వాయుసేనలో చేరనుంది. పూర్తిగా పాతబడిపోయిన ఈ విమానాన్ని బెంగళూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ కొని బ్రిటన్‌లో ఆరేళ్లు మరమ్మతులు చేయించి వాయుసేకు బహుమతిగా అందిస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మంగళవారం ఢిల్లీలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవాకు అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌ వైమానిక స్థావరంలో దీనిని ఉంచనున్నారు.

డకోటాగా పిలిచే డగ్లస్‌ డీసీ3 విమానాలను 1930ల్లో వాయుసేనలో ప్రవేశపెట్టారనీ, లడఖ్‌తోపాటు ఈశాన్య ప్రాంతంలో ఇవి ప్రధానంగా సేవలందించేవని ధనోవా గుర్తుచేశారు. డకోటా యుద్ధ విమానాల వల్లే జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ ఇంకా మనదగ్గర ఉందని మిలిటరీ చరిత్రకారుడు పుష్పీందర్‌ సింగ్‌ గతంలో అన్నారు. ఈ విమానానికి భారత్‌ ‘పరశురామ’ అని నామకరణం చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఈ విమానం వచ్చే నెలలోనే భారత్‌కు చేరుకోనుంది. ఈ విమానాన్ని కొని మరమ్మతులు చేయించడంలో తనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని చంద్రశేఖర్‌ తెలిపారు. చంద్రశేఖర్‌ తండ్రి గతంలో డకోటా విమానాలకు పైలట్‌గా పనిచేయడం విశేషం. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌