amp pages | Sakshi

నల్లధనంపై కఠిన చర్యలు

Published on Wed, 04/10/2019 - 04:23

న్యూఢిల్లీ: నల్లధనం చెలామణీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం(ఈసీ) దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహితులతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన దాడులపై బుధవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శిపాండే, సీబీడీటీ చైర్మన్‌ పీసీ మంగళవారం ఎన్నికల సంఘంను కలిసి ఐటీ, ఈడీ, కస్టమ్స్, డీఆర్‌ఐ విభాగాలు జరిపిన సోదాలపై వారికి వివరించారు. మధ్యప్రదేశ్‌లో దాచిన డబ్బును భారీగా ఢిల్లీకి తరలించి, నిల్వ ఉంచుతున్నట్లు అందిన నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకే  దాడులు జరిపినట్లు తెలిపారు.

ఈ దాడుల్లో రూ.281 కోట్ల లెక్కలో చూపని డబ్బు వెలుగు చూసిందని వివరించారు. విదేశాల్లో ఆస్తులు, బీనామీ ఆస్తులు, ఆస్తుల కీలక పత్రాలకు సంబంధించి త్వరలో ఐటీ శాఖ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్పందించిన ఈసీ.. నల్లధనం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. అయితే, దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని, దాడులకు ముందుగా సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు(సీఈవో)లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చిన మార్చి 10వ తేదీ తర్వాత ఐటీ శాఖ పలువురు రాజకీయ నేతలు, వారి సంబంధీకులపై దాడులు చేపట్టడంపై కేంద్ర సంస్థలను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌