amp pages | Sakshi

సల్మాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

Published on Thu, 04/05/2018 - 14:24

సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌ కు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. కాగా  జోధ్‌పూర్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో కండలవీరుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్‌ అడవుల్లో సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్‌​ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టులో వాదనలు వినిపించారు.

కాగా, జోధ్‌పూర్‌ కోర్టు తీర్పును సల్మాన్‌ ఖాన్‌ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సల్మాన్‌ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)