amp pages | Sakshi

అశ్లీలతకు బ్రేక్‌.. హర హర మహాదేవ!

Published on Thu, 11/16/2017 - 18:28

వారణాసి : బనారస్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఒకాయన కనిపెట్టిన యాప్‌ అశ్లీల సైట్లకు బ్రేకులు వేస్తుందంట. ఆ యాప్‌ ఉన్న ఫోన్లలో పోర్న్ సైట్లు ఓపెన్‌ చేస్తే చాలూ వాటిని బ్లాక్ చేయటమే కాదు.. వెంటనే భక్తి పాటలు మారుమోగుతాయి కూడా. సంస్కారి యాప్‌గా ఇప్పుడు ఇది ప్రాచుర్యం పొందుతోంది.

బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ న్యూరాలజీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ విజ‌య‌నాథ్ 'హ‌ర హ‌ర మ‌హ‌దేవ‌' పేరిట దీనిని రూపొందించారు. అశ్లీల కంటెంట్‌ లేదా తీవ్ర హింస ఉన్న వీడియోలు, ఫోటోలు ఓపెన్‌ చేస్తే చాలూ ఇది పని చేస్తుందన్న మాట. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల నిఘాకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పిల్లల కోసం దీనిని డెవలప్‌ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ యాప్‌కు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఇన్‌స్టాల్‌ చేశాక హైడ్‌లోకి వెళ్లిపోతుంది. తద్వారా దానిని ఇన్‌స్టాల్‌ చేశారన్న విషయం కూడా ముందు వారు గుర్తించలేకపోతారన్నమాట.

దీనిని harharmahadev.co వెబ్‌సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చని విజయనాథ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్‌ హిందూ భ‌క్తిపాట‌ల‌ను మాత్ర‌మే ప్లే చేస్తోంద‌ని, త్వ‌ర‌లో ఇత‌ర మ‌తాల గీతాల‌ను కూడా పొందుప‌రిచి యాప్‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఆయన వెల్ల‌డించాడు. అయితే ల్యాప్‌ ట్యాప్‌లు, డెస్క్‌ టాప్‌ వర్షన్‌లకు అందుబాటులో ఉన్న ఈ యాప్‌ అండ్రాయిడ్‌ ఫోన్లకు పూర్తిస్థాయిలో రావటానికి కాస్త సమయం పడుతుందని వెబ్ డెవలపర్‌ అంకిత్‌ శ్రీవాస్తవ చెబుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌