amp pages | Sakshi

వీడియోతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్‌!

Published on Thu, 02/20/2020 - 10:07

లక్నో: ‘చాలెంజ్‌ చేసి చెబుతున్నా.. నా విద్యార్థులు ఒక్కరు కూడా పరీక్షల్లో ఫెయిల్‌ అవ్వరు. ఎలాగైనా వారు పాసైపోతారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే జవాబుపత్రంలో ఓ వంద రూపాయలు ఉంచండి’ అంటూ పరీక్షల్లో ఎలా కాపీ కొట్టాలో చెబుతూ ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ అడ్డంగా బుక్కయ్యాడు. అతడి ‘ప్రసంగాన్ని’  ఓ విద్యార్థి చిత్రీకరించగా.. వీడియో ఆధారంగా పోలీసులు సదరు ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... రాష్ట్రంలో మంగళవారం నుంచి యూపీఎస్‌ఈబీ(బోర్డ్‌ ఎగ్జామ్స్‌) పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మావో జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం... తమ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సమావేశానికి ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపల్‌, మేనేజర్‌ ప్రవీణ్‌ మాల్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్‌ సెంటర్‌లో మీరు భయపడా​ల్సిన పనిలేదు. పరీక్ష రాసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కానీ ఎదుటి వారి చేతులు తాకొద్దు. ఒకవేళ మాట్లాడుకుంటూ దొరికిపోయినా అస్సలు భయపడవద్దు. రెండు చెంపదెబ్బలు వేసినా భరించాలి. ముఖ్యంగా సమాధాన పత్రాన్ని ఖాళీగా ఉంచకూడదు. వీలైతే అందులో ఓ వంద రూపాయల కాగితం పెట్టండి. అప్పుడు టీచర్లు మీకు గుడ్డిగా మార్కులు వేసేస్తారు. ఇలా చేస్తే నాలుగు మార్కుల జవాబుకు కనీసం మూడు మార్కులైనా వేస్తారు’’ అంటూ విద్యార్థులకు హితబోధ చేశాడు. ఈ క్రమంలో.. ఓ విద్యార్థి ప్రిన్సిపల్‌ మాటలను రహస్యంగా రికార్డు చేశాడు. అనంతరం గ్రీవెన్స్‌ సెల్‌లో వీడియోతో సహా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్‌ మాల్‌ను అరెస్టు చేశారు.

చదవండి: బీజేపీ ఎమ్మెల్యే అకృత్యం.. కేసు నమోదు!

కాగా యూపీలో మంగళవారం నుంచి ప్రారంభమైన బోర్డ్‌ ఎగ్జామ్స్‌(పది, పన్నెండో తరగతి)కు దాదాపు 56 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు యోగి సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలతో మానిటరింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటుగా... సున్నితమైన ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పిస్తోంది. 75 జిలాల్లలోని 7784 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ట్విటర్‌లో ఓ అకౌంట్‌ను క్రియేట్‌ చేసింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)