amp pages | Sakshi

స్పీకర్ కు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా..?

Published on Sat, 02/18/2017 - 15:10

చెన్నై: విశ్వాసపరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో నేటి ఉదయం నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ మద్ధతుదారులు సభ సజావుగా సాగకుండా యత్నిస్తుండటంతో సభను స్పీకర్ ధన్ పాల్ పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్ కు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాస్తవంగా అసెంబ్లీలో నేడు పళనిస్వామి ప్రభుత్వానికి అజెండా అంటూ ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వానికి మద్ధతు ఉందని పళనిస్వామి సభలో నిరూపించుకుంటే.. దానిపై సభాపతి గవర్నర్ విద్యాసాగర్ రావుకు నివేదిక అందించాల్సి ఉంటుందని సురేష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధాకరమన్నారు. విశ్వాసపరీక్ష రహస్య ఓటింగ్ ప్రకారమే జరిపించాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవన్నారు.

సభలోకి పోలీసులు ఎలా వస్తారంటూ డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.. కానీ మార్షల్స్ వచ్చినా, నేతలు వచ్చినా, ఇతర ఏ సిబ్బంది వచ్చినా సభాపతి ఆదేశాల మేరకు ఇలా జరుగుతుందన్నారు. సభ సజావుగా సాగకుండా, ఇబ్బందులకు గురిచేస్తూ.. తీవ్ర ఆటంకం కలిగించిన నేపథ్యంలో సభాపతి మార్షల్స్ కు కొన్ని ఆదేశాలు జారీచేస్తారు. సభాపతి ఆదేశాల మేరకు ఆయా ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు లాక్కెళ్తారని చెప్పారు.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగ పరంగా విశ్వాస పరీక్ష లేదా బలనిరూపణలో నెగ్గాల్సి ఉంటుందని, అప్పటినుంచీ పూర్తిస్థాయి ప్రభుత్వం కార్యరూపం దాల్చినట్లని వివరించారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో అలాగే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)