amp pages | Sakshi

బీఎస్‌ఎఫ్‌ చరిత్రలో తొలి మహిళా అధికారి

Published on Sat, 03/25/2017 - 22:39

గ్వాలియర్‌: ఐదు దశాబ్దాల సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) చరిత్రలో దళంలో చేరిన తొలి మహిళా అధికారిగా తనుశ్రీ పరీక్‌ (25) రికార్డు సృష్టించారు. 52 వారాల శిక్షణ అనంతరం టెకన్‌పూర్‌ బీఎస్‌ఎఫ్ శిక్షణా కేంద్రంలో శనివారం జరిగిన పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో 67 మంది అధికారుల దళానికి తనుశ్రీ నాయకత్వం వహించారు. రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన పరీక్‌, 2014లో యూపీఎస్సీ నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆఫీసర్‌ ర్యాంకులో బీఎస్‌ఎఫ్‌లో చేరారు.

పంజాబ్‌లోని ఇండో-పాక్‌ సరిహద్దు వెంబడి ఉన్న ఓ యూనిట్‌కు అధికారిగా పరీక్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సరిహద్దు భద్రతా దళాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళిక రచిస్తోందన్నారు. మిలిటరీ తర్వాత భూ, వాయు, జలాల్లో పని చేస్తున్న రెండో దళంగా బీఎస్‌ఎఫ్‌ను ప్రశంసించారు. బీఎస్‌ఎఫ్‌ తొలి రక్షణ రేఖ మాత్రమే కాదని, తొలి రక్షణ గోడ అని పొగిడారు.

ఇటీవల విధి నిర్వహణలో మృతిచెందిన సిబ్బందికి నివాళులర్పించిన రాజ్‌నాథ్‌.. దళంలోని సమస్యల పరిష్కారానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తోందన్నారు. టెకన్‌పూర్‌ క్యాంప్‌ను సందర్శించిన సింగ్‌.. టియర్‌ స్మోక్‌ యూనిట్‌ (టీఎస్‌యూ) రూపొందించిన పీఏవీఏ షెల్‌ ఫైరింగ్‌ ప్రదర్శనను తిలకించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు ఉపయోగించే పెల్లట్‌ గన్ల స్థానంలో ఈ షెల్‌లను వినియోగించనున్నారు.

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?