amp pages | Sakshi

విదేశీ యువతిని వివస్త్రను చేసి..

Published on Thu, 02/04/2016 - 01:58

బెంగళూరులో టాంజానియా యువతిపై దారుణం
బాధ్యులపై చర్యలకు సుష్మ ఆదేశాలు

 
 సాక్షి, బెంగళూరు: ఓ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఓ విదేశీ యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి స్థానికులు భౌతిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, వారి స్నేహితులు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం... టాంజానియాకు చెందిన 21 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని. ఆదివారం సాయంత్రం అద్దె కారులో వెళ్తుండగా హెసరగట్టకు  చేరుకోగానే అదుపుతప్పి 35 ఏళ్ల యువతికి ఢీ కొంది. దీంతో ఆమె మరణించింది. కారు నడుపుతున్న  సుందరేషన్  పరారయ్యాడు. 

వెనుక కూర్చున్న విద్యార్థి కిందికి దిగగానే స్థానికులు అక్కడికొచ్చి ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. తాను చెబుతున్నది వినిపించుకోక ఆ యువతి టీ షర్టును చించి వేశారు. ఎలాగో తప్పించుకుని నెమ్మదిగా కదులుతున్న బీఎంటీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నించినా వెంటబడి రోడ్డుపై వేసి చితకబాదారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థిని స్నేహితుల్లో ఒకరు  బాధితురాలికి టీ షర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించడంతో  యువతితో పాటు ఆమెకు సాయం చేయడానికి వచ్చిన వారిపై కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు.

అంతేకాకుండా యువతి ప్రయాణిస్తున్న వాహనాన్ని తగులబెట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తమను రక్షించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదని బాధితురాలి స్నేహితులు వాపోయారు. ఇదిలా ఉండగా ఆఫ్రికా దేశపు విద్యార్థులు తరుచూ మద్యం మత్తులో వాహనాలు నడపి ప్రాణాలమీదకు తెస్తున్నారని, తమతో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటున్నారని స్థానికులు వాపోతుండటం గమనార్హం. అయితే..  టాంజానియా హై కమిషనర్,  విదేశాంగ మంత్రి సుష్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సుష్మ స్వరాజ్ కూడా కర్ణాటక సీఎం, ఇతర అధికారులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)