amp pages | Sakshi

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు

Published on Sat, 06/10/2017 - 08:36

నేడు ఇడికుడలో పాల్వాయి అంత్యక్రియలు
నల్లగొండ: పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి  భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శనివారం ఉదయం గాంధీభవన్‌లో ఉంచనున్నట్టు ఉత్తమ్‌ తెలిపారు. అనంతరం పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడకు తరలించనున్నారు. నేటి సాయంత్రం 5.30 గంటలకు పాల్వాయి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

మధ్యప్రదేశ్ సీఎం నిరవధిక నిరాహార దీక్ష
భోపాల్‌: రైతుల ఆందోళన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు ఆయన భోపాల్ లోని దసరా మైదానంలో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించనున్నారు.

టీఎస్‌ లాసెట్‌ ఫలితాలు
కేయూ క్యాంపస్‌: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. గత నెలలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తంగా 24,858 మంది విద్యార్థులకుగాను 21,203 మంది (85.65శాతం) హాజరయ్యారు. నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రంగారావు వెల్లడించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడే
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వెయ్యి బస్సులు రోడ్డెక్కకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. నిబంధనలను పాటించని దాదాపు వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నిలిచిపోనున్న కొన్ని వేల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వర్షాలు
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొంకణ్, మధ్య కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి బయట ఓ కిలోమీటర్‌ మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

చాంపియన్స్ ట్రోఫీ
నేడు (శనివారం) ఇంగ్లండ్‌తో తలపడనున్న ఆస్టేలియా.

ఫ్రెంచ్ ఓపెన్
ప్యారిస్: నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్లో హలెప్‌తో తలపడనున్న ఒస్టా పెంకో
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)