amp pages | Sakshi

కరోనా ఎఫెక్ట్‌ : మెట్రో ప్రయాణానికి విముఖత

Published on Mon, 06/29/2020 - 15:30

సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైళ్లు, లోకల్‌ రైళ్లు ప్రారంభమైనా రానున్న నెల రోజుల పాటు వాటిలో ప్రయాణం చేయబోమని లోకల్‌సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో 67 శాతం మంది తేల్చిచెప్పారు. ఇక వచ్చే నెల రోజుల్లో జిమ్నాజియం, స్విమ్మింగ్‌పూల్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులే పేర్కొన్నారు.రాబోయే మూడు నెలల పాటు విహార యాత్రలకు, హోటళ్లలో గడిపేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోలేదని 93 శాతం మంది పేర్కొన్నారు. జూన్‌ 30తో అన్‌లాక్‌ 1.0 ముగుస్తున్నా పలు రంగాలకు భారీ సడలింపులు ప్రకటించినా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

అన్‌లాక్‌ 2.0 దశలో ప్రజలు మెట్రో, లోకల్‌ ట్రైన్లను ఎంతవరకూ ఉపయోగించుకుంటారు...జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లకు వెళ్లడం, విహార యాత్రలకు ప్లాన్‌ చేయడంపై లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో పౌరులను ప్రశ్నించడం ద్వారా 24,000 సమాధానాలను రాబట్టింది. కాగా వీలైనంత త్వరలో మెట్రో సర్వీసులను పునరుద్ధరిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌ ఇటీవల వెల్లడించింది. జూన్‌ 15న ముంబైలో లోకల్‌ రైళ్ల రాకపోకలు ప్రారంభమైనా ప్రయాణీకుల నుంచి స్పందన పరిమితంగా ఉండటం గమనార్హం.

ఇక వచ్చే నెలరోజుల్లో మెట్రో రైళ్లు, లోకల్‌ రైళ్లు పునఃప్రారంభమైతే వాటిలో ప్రయాణిస్తామని 25 శాతం మంది పేర్కొనగా, కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో మెట్రో ప్రయాణం సురక్షితం కాదని 67 శాతం మంది పౌరులు వెల్లడించారు. పెట్రో ధరలు ఇటీవల భారీగా పెరిగి తమ జేబులకు చిల్లు పెడుతున్నా కరోనా భయంతో వాహనదారులు ప్రజా రవాణావైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక రానున్న నెల రోజుల్లో జిమ్నాజియంలు, స్విమ్మింగ్‌పూల్స్‌ తెరుచుకున్నా వాటిని సందర్శించబోమని 84 శాతం మంది వెల్లడించగా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులు పేర్కొన్నారు.

చదవండి : మెట్రో నష్టాన్ని చెల్లించండి!

Videos

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)