నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్రేకింగ్: కుప్పకూలిన ఫ్లైఓవర్
Published on Sat, 08/11/2018 - 10:11
లక్నో : నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్, బస్తీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో వర్షం పడుతుండటంతో ఫ్లై ఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన బీమ్‌లు భూమిలోకి కుంగిపోయాయని దీంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. జాతీయ రహదారి 28పై లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ప్రమాదపు సమాచారాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
#
Tags