amp pages | Sakshi

వెజిట్రబుల్స్

Published on Fri, 06/27/2014 - 22:20

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టులేదు.. అనే పాట పాడుకోవడానికి అసలైన సందర్భం ఇదేనేమో..! ఎందుకంటే చినుకు పడక, మొక్క మొలకెత్తక కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌కు రావాల్సినంత సరుకు రాకపోవడంతో ఉన్న సరుకు ధర అమాంతంగా పెరిగిపోతోంది. దీంతో కిలో కొందామని మార్కెట్‌కు వచ్చి పావుకిలోతో ‘ఆయన’ ఇంటికి వెళ్తుండగా... కొసరు సరుకుతో వంట చేయాల్సిన పరిస్థితి ‘ఆమె’ది. ఇప్పుడే చుక్కలనంటు తున్న కూరగాయల ధరలు మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవకపోతే ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేసే దుస్థితి నెలకొంది.
 
 సాక్షి, ముంబై:
వర్షాలు ముఖం చాటేయడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో నవీముంబై, వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతీరోజు వందలాదిగా రావాల్సిన కూరగాయల ట్రక్కులు పదుల సంఖ్యలో వస్తున్నాయి.  ఫలితంగా నిల్వలు తగ్గిపోయి సరుకు కొరత తీవ్రమవుతోంది. దీని ప్రభావం సరుకు ధరలపై పడుతోంది. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో కూరగాయలు సాగు చేయాల్సిన రైతులు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇక సాగు చేసినా సరైన దిగుబడి రాని పరిస్థితి నెలకొంటుందంటున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో కూరగాయల ధరలు 15-20 శాతం పెరిగిపోయాయి. ప్రతీ సంవత్సరం వేసవి కాలంలో దిగుబడి తగ్గిపోయి ధరలు పెరుగుతాయి. అయితే జూన్ మొదటి వారంలో వర్షాలు కురవడంతో ధరలు తగ్గుముఖం పడతాయి.
 
 కాని ఈ ఏడాది వేసవిలో పెరిగిన ధరల జోరు జూన్ పూర్తయినా కూడా కొనసాగుతోంది. వర్షాలు పత్తా లేకపోవడంతోనే వేసవిలోకంటే కూడా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. గత నెలలో ఏపీఎంసీలోకి ప్రతీరోజు 550 పైగా ట్రక్కులు కూరగాయల లోడ్లతో వచ్చాయి. అయితే జూన్ నెల మొదటి వారంలో ఏరోజూ ట్రక్కుల సంఖ్య 500 దాటలేదు. రెండోవారం వచ్చేసరికి మరింతగా తగ్గింది. నెలాఖరునాటికి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్రక్కులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఒకవేళ మరో వారంరోజుల్లో వర్షాలు కురవకపోతే కూరగాయల ధరలు మరింత మండిపోతాయని ఏపీఎంసీ కి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి తెలిపారు. ఇదిలావుండగా కూరగాయల ధరలు పెరిగినప్పటికీ టమాటాలు మాత్రం కొంత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం టమాటలు ఏపీఎంసీలో హోల్‌సెల్‌గా 10 కేజీలకు రూ.140 చొప్పున ధర పలుకుతున్నాయి. కొనుగోలుదారుల చెంతకు వచ్చే సరికి అవి కేజీకీ రూ.20 చొప్పున లభిస్తున్నాయి. మిగతా కూరగయాలతో పోలిస్తే వీటి ధర తక్కువగానే ఉందని చెబుతున్నారు.
 
 ఏపీఎంసీలో ప్రస్తుతం హోల్‌సెల్‌లోలభిస్తున్న కూరగాయలు.
 పెరిగిన కూరగాయల ధరల వివరాలు (10 కేజీలకు)
 కూరగాయ    గతనెలలో    ప్రస్తుతం
 క్యాలీప్లవర్    రూ.140        రూ.200
 క్యాబేజీ        రూ.100        రూ.140
 వంకాయలు    రూ.200        రూ.300
 పచ్చిబఠానీ    రూ.250        రూ.340
 సొరకాయ    రూ.100        రూ.200

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)