amp pages | Sakshi

చికెన్‌ ముక్కలు లెక్కగట్టి పెడతారట

Published on Tue, 04/11/2017 - 16:50

న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్లలో వృథా అయ్యే ఆహారాన్ని సేవ్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఆహార రంగానికి చెందిన ముఖ్యులతో ఈ మేరకు సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పశ్వాన్‌ మీడియాతో పేర్కొన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చే వారికి ఒక్కో ప్లేటుకు ఎంత ఆహారం వడ్డించాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.

తాను రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలో ఆహారం వృథా కావడం గమనించినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పేదలు కలిగిన భారత్‌ లాంటి దేశంలో ఆహారం వృథాగా పోవడం మంచిది కాదన్నారు. రెస్టారెంట్లకు వచ్చే వారికి వడ్డించే ఆహారంపై చట్టపరమైన నిబంధనలు తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఆహారంపై ఆంక్షలు వేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. ఇంట్రెస్ట్‌ ఆఫ్‌ కన్‌జ్యూమర్స్‌ ఉన్నందు వల్లే ఈ దిశలో యోచిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లు, హోటళ్లు అన్నింటిలో ఒకే విధమైన రూల్స్‌ను తెచ్చే విషయంపై ఆహార రంగ నిపుణులతో చర్చలు జరుపుతామని అన్నారు. ఏ ఐటమ్‌ను ఎంత మొత్తంలో సర్వ్‌ చేస్తారనే విషయాన్ని రెస్టారెంట్లు, హోటళ్లు రాతపూర్వకంగా సమర్పించాల్సివుంటుందని తెలిపారు.

అయితే, ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకోగలడు అనే దాన్ని అంచనా వేసి ఆ మేరకు నిబంధనలు తయారు చేస్తామని చెప్పారు.  అంటే ఒక వ్యక్తి ఎన్ని చికెన్‌ ముక్కలు తినగలడు అనే దాన్ని అంచనా వేసి అన్ని చికెన్‌ పీస్‌లు లెక్కగట్టి పెడతారనమాట. కాగా ధాబాల్లో మాత్రం ఈ నిబంధనలు వర్తించబోవని తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)