amp pages | Sakshi

ముందుగానే శీతాకాల సమావేశాలు!

Published on Mon, 08/29/2016 - 02:14

- నవంబర్ మొదట్లోనే నిర్వహించే యోచన
- జీఎస్‌టీ ఆమోదమే ప్రభుత్వ లక్ష్యం
 
 సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్‌టీ మద్దతు బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను పక్షం రోజులు ముందుగానే, అంటే నవంబర్ మొదట్లోనే ప్రారంభించాలని అనుకుంటోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు మూడవ లేదా నాల్గవ వారంలో ప్రారంభమవుతాయి. సీజీఎస్‌టీ (సెంట్రల్ జీఎస్‌టీ), ఐజీఎస్‌టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ) బిల్లులు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందితే, నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారానికల్లా జీఎస్‌టీకి మార్గం సుగమం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

జీఎస్‌టీ కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతుగా  సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. జీఎస్‌టీ కోసం పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారేందుకు 31 రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.  రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే పలు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా మిగిలిన శాసనసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే అవకాశాలున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Videos

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)