amp pages | Sakshi

ఘోరం.. నడిరోడ్డుపై ప్రసవం

Published on Mon, 09/25/2017 - 11:21

జయపురం(ఒడిశా): నడిరోడ్లపైన, ఆటోలలోను, ఆరుబయట ప్రదేశాలలోను  గర్భిణులు ప్రసవిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకండా తగిన చర్యలు చేపట్టేందుకు  ప్రభుత్వం చర్యలు శూన్యంగా ఉన్నాయి. అందుచేత  గర్భిణులు పురిటి నొప్పులతో రోడ్లపై  ప్రసవిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొరాపుట్‌ జిల్లా దశమంతపూర్‌ సమితిలో ఒక గర్భిణిని   ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు 102 అంబులెన్స్‌ రాకపోవడంతో బంధువులు ఆమెను మోసుకు వెళ్తుండగా రోడ్డుపైనే జోలిలో   మగబిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన జిల్లాలో జననీ సురక్షా పథకాలు, 102 అంబులెన్స్‌ల పనితీరును, మారుమూల గ్రామీణ ప్రాంతాల దురావస్థను చాటి చెబుతోంది.

కొరాపుట్‌ జిల్లా దశమంతపూర్‌ సమితిలోని మారుమూల దుర్గమ ప్రాంతం ముర్జ గ్రామ పంచాయతీలోని కుసుమపుట్‌ గ్రామం. గ్రామానికి చెందిన  జునేశ్‌ జానీ భార్య సువాలొంగ్‌ గర్భిణి. ఆమె శనివారం పురిటి నొప్పులతో మెలికలు తిరుగుతూ బాధపడుతుంటే భర్త వెంటనే ఈ విషయం గ్రామంలోని ఆశా కార్యకర్తకు తెలియజేశాడు. ఆమె వచ్చి పరిస్థితిని చూచి 102  అంబులెన్స్‌కు ఫోన్‌చేసి వెంటనే రమ్మని కోరింది.  అయితే మచ్ఛపుట్‌–కుసుముపుట్‌  గ్రామాల మధ్య రహదారి బాగులేక పోవడం వల్ల అంబులెన్స్‌ రాలేక పోయింది. మరోమార్గం లేక గర్భిణి బంధువులు ఆమెను ఒక జోలీలో మోసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఆమె ప్రసవించింది.  అయితే అమెను  హాస్పిటల్‌కు చేర్చాలన్న లక్ష్యంతో అంబులెన్న ఉన్న చోటువరకు తల్లీబిడ్డలను  బంధువులు మోసుకువెళ్లారు. అక్కడినుంచి తల్లీబిడ్డలను దశమంతపూర్‌ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి తరలించారు.  

అధ్వానంగా రహదారులు
ముఖ్యంగా జిల్లాలో అనేక  గ్రామాలకు రహదారులు లేకపోవడం, ఉన్నా అవి గతకుల మయమై వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, తదితర కారణాలన్న    అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేసేందుకు, పంచాయతీలతో గ్రా మ ప్రాంతాలను సంధానపరిచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా అత్యధిక గ్రామాలు, ముఖ్యంగా మారు మూల దర్గమ ప్రాంతాలలో గల గ్రామాలకు రోడ్లు లేకపోవడం వల్ల ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)