amp pages | Sakshi

నాటా ఉత్సవాల్లో నరాల రామారెడ్డి అష్టవధానం

Published on Wed, 07/04/2018 - 10:57

వాషింగ్టన్‌ డీసీ : తన పదహారవఏటనే అవధానం ప్రారంభించిన నరాల రామారెడ్డి నాటా తెలుగు ఉత్సవాల్లో భాగంగా జులై 8వ తేది ఉదయం 9 గంటలకు అష్టవధానం చేయనున్నారు. నరాల రామారెడ్డి గత 52 ఏళ్లుగా దాదాపు వెయ్యి అవధానాలు చేశారు.  అమెరికా తెలుగు సంఘాలైన ఆటా, నాటా, తానా ఆహ్వానాలను అందుకొని అమెరికాలో పలుమార్లు అవధానం చేసి మన్ననలందుకున్నారు. జూలై 6,7,8న ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా తెలుగు ఉత్సవాలలో నరాల రామారెడ్డి మరోసారి అష్టవధానం చేయనున్నారు. ఈ అవధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్‌ఆర్‌ఐలు హాజరై విజయవంతం​ చేయాలని నాటా కన్వెన్షన్‌ 2018 లిటరరీ కమిటీ ఛైర్‌ జయదేవ్‌ మెట్టుపల్లి కోరారు.

అవధాన చరిత్ర : తెలుగు సాహిత్యనందనోద్యానంలో విలక్షణంగా వికసించిన పుష్పం అవధానం. ఇది పద్యకవితా సుమగంధాలను విరజిమ్ముతుంది. చమత్కారమకరందాలను చిందిస్తుంది. భారతీయ భాషల్లో కేవలం తెలుగు బాషలోనే రూపుదిద్దుకున్న ప్రక్రియ అవధానం ఇది తెలుగువారి సొంతం. సంస్కృత భాష లో వున్న "సమస్యాపూరణం"  అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని  1854 సంవత్సరంలో మహా పండితులు మాడభూషి వేంకటాచార్యులు “సమస్య” అనే అంశానికి "నిషిద్ధాక్షరి  దత్తపది, వ్యస్తాక్షరి, మొదలైన అంశాలను జోడించి " "అష్టావధానం"  అనే పక్రియను రూపకల్పన చేశారు.
 
అవధాన ప్రాశస్త్యం : మాడభూషి  వారి మార్గ దర్శకత్వంలో జంటకవులైన తిరుపతి వేంకట కవులు తెలుగు ప్రాంతమంతట జైత్రయాత్ర సాగించి అవధాన పక్రియను జన బాహుళ్యంలోకి తెచ్చారు.
"అష్టావధాన కష్టాలంబనమన్న
నల్లేరుపై బండిన డక మాకు
శతావధాన విధాన సంవిదానంబన్న
షడ్రసోపేత భోజనము మాకు"
అని తిరుపతి కవులు అవధానరంగంలో సింహాల్లా విజృంభించారు.

అష్టావధానంలొ ఎనిమిది అంశాలుంటాయి. సమస్యాపూరణం , దత్తపది అనే అంశాలు  అవధాని చమత్కార ప్రతిభను పరీక్షిస్తాయి. నిషిద్దాక్షరి, వ్యస్తాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. ఘంటాగణనం, పురాణపఠనం అవధాని ఏకాగ్రతను పరీక్షిస్తాయి. వర్ణన ఆశుకవిత అవధాని కవితా కౌశల్యాన్ని  పరీక్షిస్తాయి. అవధానం చేసే వ్యక్తికి ధార (Flow), ధారణ ( preservation ), ధిషణ (talent), ధోరణి (presence of mind), ధైర్యం (courage) అనే పంచధకారాలు ఉండాలని  విజ్ఞులు చెప్పారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)