amp pages | Sakshi

ఆస్టిన్‌లో ఘనంగా వైఎస్సార్‌సీపీ 9వ ఆవిర్భావ వేడుకలు

Published on Thu, 03/14/2019 - 10:57

ఆస్టిన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు ఆస్టిన్, టెక్సాస్‌లో ఘనంగా జరిగాయి. రాక్ ఎన్ గ్రిల్‌లో జరిగిన ఈ వేడుకలకు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి ఆవుల, శ్రీ కొత్తపల్లి, కొండా రెడ్డి ద్వారసల, అశోక్ రెడ్డి గూడూరు, కుమార్ అశ్వపతి, నారాయణ రెడ్డి గండ్ర, కరుణ్ రెడ్డిలు ప్రసంగించారు. వైఎస్‌ జగన్ చేసిన పాదయాత్ర ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, నవరత్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. అలాగే 2019 అసెంబ్లీ  ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగిస్తుందని, ఈ శ్రీరామనవమితో ఆంధ్రాలో దుష్ట రాక్షస పాలన ముగిసి రామరాజ్యం రాబోతోందన్నారు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆస్టిన్ అభిమానులు పలు సామజిక సేవా కార్యక్రమాలతో సమాజానికి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్ బల్ల, ప్రవర్ధన్ చిమ్ముల, రఘు జడల, విఠల్ రెడ్డి, రాంమోహన్ అరికూటి, ఆసిఫ్, శివ ఎర్రగుడి, కేదార్, అనంత్, రమణా రెడ్డి, శ్రీని కొత్త, సుబ్బా రెడ్డి వైఎస్‌ఆర్, వెంకట్‌లతో పాటూ పలువురు పాల్గొని జయప్రదం చేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌