amp pages | Sakshi

నా కుమారుడి ఆచూకీ తెలపండి

Published on Thu, 05/02/2019 - 06:48

పంజగుట్ట: శ్రీకాకుళంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఎలాంటి ఉపాధి లేక దుబాయికి వలస వెళ్లి ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. తన కుమారుడి ఆచూకీ కనుక్కొవాలని ఆ తండ్రి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధితుని తండ్రి కె. శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు మండలం, చిన్నమూరహరిపురం గ్రామానికి చెందిన తాను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. తనకు ముగ్గురుకు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు కె. జగదీశ్వర్‌ రావు (23) ఐటీఐ పూర్తి చేసి ఉపాది నిమిత్తం  ఎమిరేట్స్‌  కంపెనీ తరపున అక్కడి అలీ–6 షిప్‌లో డీజీల్‌ మెకానిక్‌గా 2018 సెప్టెంబర్‌ 17న విధుల్లో  చేరాడని తెలిపారు.

ఈ ఏడాది మార్చి 7వ తేదీన జగదీశ్వర్‌ రావు తల్లి శ్యామల, తండ్రి శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. 10న అదే సంస్థలో పనిచేసే  శ్రీకాకుళం మాన్యమండలం బైరిసారంగపురం గ్రామానికి చెందిన దిలీప్‌ తమకు ఫోన్‌ చేసి మీకొడుకు  రెండు రోజులుగా కనిపించడం లేదని దుబాయి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు.  వారు వెతికినా కూడా ఎలాంటి ఫలితం లేదని తెలిపారని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా దుబాయి పోలీసులు, సంస్థ నిర్వహకులు, షిప్‌ ఇన్‌చార్జిలు తమ కొడుకు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం చొరవ చూపి తన కొడుకు ఆచూకి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్‌ బాధితుల సంక్షేమ సంఘం అ«ధ్యక్షులు బసంత్‌ రెడ్డి, వజ్రపుకొత్తూరు ఎంపీపీ వసంత స్వామి, బాధితుడి మామ పోలయ్య పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)