amp pages | Sakshi

అనంతపురం: ముగిసిన నామినేషన్ల పరిశీలన

Published on Wed, 03/27/2019 - 14:08

సాక్షి, అనంతపురం అర్బన్‌: జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాలకు 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా... ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదం పొందాయి. నలుగురి నామినేషన్లను తిరస్కరించారు. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి 12 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 9 మంది నామినేషన్లు ఆమోదించారు. ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు.

ఇక 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 190 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. 64 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా నామినేషన్లు తిరస్కరణకు గురైన నియోజకవర్గాలో ధర్మవరం మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో పుట్టపర్తి ఉంది. ధర్మవరం నియోజకవర్గానికి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 ఆమోదం పొందాయి. 15 తిరస్కరణకు గురయ్యాయి. ఇక పుట్టపర్తి నియోజకవర్గానికి 28 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా 21 ఆమోదం పొంది, 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 

ఆమోదం పొందిన ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు 
అనంతపురం పార్లమెంట్‌: తలారి రంగయ్య (వైఎస్సార్‌సీపీ), జేసీ పవన్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్‌ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ), కె.రాజీవ్‌రెడ్డి (కాంగ్రెస్‌), జి.లలిత (ఎస్‌యుసీఐ) 
హిందూపురం పార్లమెంట్‌: గోరంట్ల మాధవ్‌ (వైఎస్సార్‌సీపీ), నిమ్మల కిష్టప్ప (టీడీపీ), ఎం.ఎస్‌.పార్థసారథి (బీజేపీ), కె.టి.శ్రీధర్‌ (కాంగ్రెస్‌)  

పార్లమెంట్‌ ఆమోదం తిరస్కరణ మొత్తం
అనంతపురం 14 4 18
హిందూపురం 9 3 12
  • 14 అసెంబ్లీ స్థానాలకు 190 ఆమోదం, 64 తిరస్కరణ  

నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ 
అనంతపురం అర్బన్‌: నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారంతో ముగియగా...ఉపసంహరణకు 28వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో  ఉపసంహరణ ప్రక్రియ బుధు, గురువారాలు కొనసాగనుంది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాలకు 30 మంది నామినేషన్‌ వేయగా, 23 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. అదే విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది నామినేషన్లు వేయగా 190 ఆమోదం పొందాయి. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారో...? ఎంత మంది బరిలో ఉంటారో 28వ తేదీన తేలనుంది.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)