amp pages | Sakshi

కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌

Published on Sun, 03/04/2018 - 15:24

సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా జరిగిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మేఘాలయలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆ అవకాశం చేజారుతున్నట్టే కనిపిస్తోంది. త్రిపురలో పాతికేళ్లుగా పెట్టనికోటగా ఉన్న కమ్యూనిస్టు కంచుకోటను కూల్చి.. నాగాలాండ్‌లోని బలమైన ఉనికితో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న బీజేపీ.. మేఘాలయ కూడా కాంగ్రెస్‌కు చిక్కకుండా మంత్రాంగం నడుపుతోంది. హంగ్‌ ఫలితాలు వెలువడ్డ మేఘాలయలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఆ పార్టీ ఇంకా పది స్థానాల దూరంలో నిలిచింది. 60 స్థానాలు ఉన్న మేఘాలయాలో కాంగ్రెస్‌ 21 స్థానాలు గెలుపొందగా, ఎన్పీపీ 19 స్థానాలు సాధించింది. ఈ క్రమంలో  కేవలం రెండు స్థానాలు గెలిచి.. తొలిసారి మేఘాలయ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న బీజేపీ.. ఇక్కడ తన పాచిక విసిరి.. కాంగ్రెస్‌ అధికారం దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతోంది.

19  స్థానాలు గెలిచిన ఎన్‌పీపీ నేతృత్వంలో ఇతర పార్టీలనకు ఒకచోటకు చేర్చి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాలు గెలిచిన యూడీపీ-హెచ్‌ఎస్‌డీపీ బీజేపీ ఏర్పాటుచేస్తున్న కూటమిలో చేరేందుకు ముందుకొచ్చింది. కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు ఆదివారం యూడీపీ చీఫ్‌ డాక్టర్‌ దొంకుపర్‌ రాయ్‌తో భేటీ అయి ఈమేరకు మంతనాలు సాగించారు. ఎన్‌పీపీ-యూడీపీ చేతులు కలుపడంతో బీజేపీ ఆకాంక్ష మేరకు మేఘాలయలో కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎన్‌పీపీ కి చెందిన కోనార్డ్‌ సంగ్మా తదుపరి మేఘాలయ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నట్టు సమాచారం.  గోవా, మణిపూర్‌ తరహాలోనే సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా ఏర్పడినప్పటికీ మరోసారి మేఘాలయాలో ఆ పార్టీకి అధికారపీఠం దూరం కానుండటం షాక్‌కు గురిచేస్తోంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్