amp pages | Sakshi

‘కాంగ్రెస్‌ పగటి కలలు కంటోంది’

Published on Tue, 08/14/2018 - 15:16

సాక్షి, హైదరాబాద్‌ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కె. లక్ష్మణ్‌ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్‌ విషయంలో పార్టమెంట్‌లో వివరణ ఇచ్చినా.. కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ మాటలు నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాహుల్‌ గాంధీ రెండు రోజుల పర్యటనతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తామని పగటికలలు కంటోందని ఎద్దేవా చేశారు.

రాహుల్‌ నిరాశతో మాట్లాడుతున్నారని, ఆయనలో ఇమ్మెచ్యుర్డ్‌ కనిపిస్తోందని విమర్శించారు. పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. రాహుల్‌ వచ్చిన తర్వాత ఒక్క పంజాబ్‌కే పరిమితం అయిందని ఎద్దేవా చేవారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను పెట్టలేక ఎన్నికలకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించే ముందు.. తెలంగాణ ప్రజలకు క్షమాణచెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.


వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కేంద్రంపై ఆరోపణలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే  కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. పాలనలో కాంగ్రెస్‌, తెరాస దొందు దొందేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాటలకు,చేతలకు సంబంధం లేదని విమర్శించారు.

జాతీయ పార్టీలు విఫలమయ్యాయంటున్న కేసీఆర్‌ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల మోదీ పాలనలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి.. నలభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధమేనని పేర్కొన్నారు. కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)