amp pages | Sakshi

బీజేపీ తరఫునే సీఏ పనిచేసిందా?

Published on Sat, 03/31/2018 - 19:04

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ తరఫున పనిచేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ‘స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ లాబరేటరీస్‌ (ఎస్‌సీఎల్‌–గ్రూప్‌)’కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ), అంతకుముందు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఎన్నికల్లో కూడా తన సేవలను అందించిందన్న విషయంపై చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. 2010లో బీహార్‌ ఎన్నికల్లో జేడీయూ తరఫున మొదటి సారి భారత ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఆ తర్వాత ఏయే ఎన్నికల్లో ఏయే పార్టీల తరఫున పనిచేసిందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో సీఏ సంస్థ ఓ రాజకీయ పార్టీ తరఫున పనిచేసిందని, అందులో 300 మంది శాశ్వత సిబ్బంది, 1400 మందిని తాత్కాలిక ఉద్యోగులతో తన సేవలను అందించిందని ‘క్వార్ట్స్జ్‌’ డాట్‌ కామ్‌  తాజాగా సేకరించిన డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. 

భారత్‌లోని అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కటక్, గజియాబాద్, గువహటి, ఇండోర్, కోల్‌కతా, పట్నా, పుణె అనే నగరాలను కేంద్రంగా సీఏ తన సేవలను అందించింది. భారత్‌ ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా పనిచేసిందని, బహూశ తమ క్లైంట్‌ కాంగ్రెస్‌ పార్టీ కావచ్చని ఈ కంపెనీ మాజీ ఉద్యోగి ఈనెల 27వ తేదీన బ్రిటీష్‌ పార్లమెంటరీ కమిటీ ముందు అంగీకరించడం, కాంగ్రెస్‌ పార్టీ క్లైంట్‌ కాదని కంపెనీ వర్గాలు ప్రకటించడం తెల్సిందే. వీటిలో ఎవరి మాట నిజమైందో తెలియదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీఏ నిజంగా పనిచేసినట్లయితే కంపెనీ పరువు పోతుంది. 

పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము సేవలందించిన స్థానాల్లో 92 శాతం తన క్లైంట్‌ అభ్యర్థులు విజయం సాధించారని కంపెనీ తెలిపింది. ఈ లెక్కన ఆ కంపెనీ బీజేపీ పార్టీ తరఫునే సేవలు అందించి ఉండాలి. స్పష్టత కోసం సీఏ, ఎస్‌సీఎల్‌ యాజమాన్యం నుంచి సమాధానాన్ని కోరింది. అయితే వారి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. వాస్తవానికి సీఏ 2013లో ఆవిర్భవించినప్పటికీ దాని మాతృసంస్థ ఎస్‌సీఎల్‌ 2003లో ఏర్పాటైన నాటి నుంచి భారత్‌లో ఎన్నికలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2003లో జరిగిన రాజస్థాన్‌ ఎన్నికల్లో ప్రధాన రాష్ట్ర పార్టీ సంస్థాగత బలం, ఓటర్ల ప్రవృత్తి, రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలపై అదే సంవత్సరం మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరఫున ఓటర్ల నాడి, ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మళ్లే ఓటర్లను గుర్తించడం లాంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. 2007లో జిహాది గ్రూపుల నియామకాలను ఎలాంటి ప్రచారం ద్వారా ఎదుర్కోవాలి అన్న అంశంపై కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, జార్ఖండ్, యూపీ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. 2010 బీహార్‌ ఎన్నికల్లో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసినట్లు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఈ సేవల కోసం సీఏ సంస్థ ఓటర్ల ఫేస్‌బుక్‌ ఖాతాలను వాడుకుందనే విషయం వెలుగులోకి రావడంతో ఈ అంశంపై గొడవ జరుగుతున్న విషయం తెల్సిందే. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)