amp pages | Sakshi

జైట్లీతో సుజనా లాలూచీ భేటీ

Published on Sat, 03/24/2018 - 01:25

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతున్నట్లు పైకి హడావుడి చేస్తున్న సీఎం చంద్రబాబు తెరవెనుక రాజీ ప్రయత్నాలు చేయటం నిజమేనని తేలిపోయింది! బీజేపీతో రాజీ కోసం తన సన్నిహితుడైన సుజనా చౌదరిని ఆయన కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వద్దకు పంపారు. ఈ విషయాన్ని సుజనాయే స్వయంగా వెల్లడించడం గమనార్హం. 

హోదా మినహా మిగతా వాటిపై సుముఖం?
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో శుక్రవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తాను అరుణ్‌ జైట్లీతో మాట్లాడినట్లు సుజనా చౌదరి వెల్లడించారు. రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం లాంటి వాటిపై జైట్లీ సానుకూలంగా మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదా మినహా మిగిలిన అన్ని అంశాలపైనా కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారని, ఇప్పుడేం చేద్దామని కాన్ఫరెన్స్‌లోనే ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు కేంద్రంతో రాజీకి సుజనాచౌదరిని రంగంలోకి దించినట్లు బహిర్గతమైంది. 

కేంద్రమే నేరుగా చెప్పాలన్న యనమల
కేంద్రమే నేరుగా ఈ విషయాలపై మాట్లాడితే బాగుంటుందని సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. మనమే కేంద్ర మంత్రులను కలిస్తే జనంలో వ్యతిరేకత వస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాధానం కూడా చెప్పుకోలేమని అన్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని కేంద్ర పెద్దలు కనిపించినప్పుడు మర్యాదగా పలకరించాలని మిగిలిన విషయాలపై ఏం చేద్దామో ఆలోచిద్దామని చెబుతూనే అయినా ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడితే ఎలా? అని సుజనాపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈశాన్య రాష్ట్రాలకు రూ.మూడు వేల కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చే నిధుల్లో మాత్రం కోత విధిస్తోందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.

మళ్లీ కలిసేందుకు తహతహ
అరుణ్‌జైట్లీతో సుజనా సమావేశమైన విషయం అనూహ్యంగా బయటపడిపోవడంతో టీడీపీ నాయకుల మధ్య ఈ అంశం చర్చనీయాంశమైంది. పార్టీలో పైకి కనిపించేది వేరు లోపల జరిగేది వేరని, కేంద్రంతో మళ్లీ కలిసేందుకు తమ నేత ప్రయత్నిస్తున్నారని టీడీపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌ సీపీ ప్రకటనతో ప్రకంపనలు
నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి ఎన్డీఏ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ స్వరం మార్చటం తెలి సిందే. కేంద్రంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని వైఎస్సార్‌ సీపీ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకం పనలు సృష్టించటంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు తాము కూడా అదే తీర్మానంపై నోటీసులిస్తున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లూ కేంద్రంలో కొనసాగుతూ అంతా సవ్యంగా ఉందని చెప్పిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రాగానే మాట మార్చారు. తనపై కేసులు పెట్టే అవకాశం ఉందని, కక్ష సాధిం పులు పెరుగుతాయని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలంటూ పదేపదే చెబుతున్నారు. ఓ ఎంపీగా తాను ప్రధాని కార్యాలయానికి వెళితే తప్పేమిటని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై పార్లమెంటులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.  

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)