amp pages | Sakshi

‘ఐపీఎల్‌ నిర్వహణలో కాంగ్రెస్‌ విఫలం’

Published on Fri, 05/03/2019 - 15:56

గాంధీనగర్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత పాలకులు వైఫల్యాల కారణంగా దేశం ఎంతో వెనుకబడి పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని కరౌలీ ప్రాంతంలో పర్యటించిన మోదీ.. కాంగ్రెస్‌ పాలకులు చేసిన తప్పిదాల కారణంగా దేశం ఎంతో నష్టపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించే సత్తాలేక ఇతర దేశానికి తరలించారని మోదీ ధ్వజమెత్తారు.

ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  ‘‘శాంతి భద్రతలు కాపాడడంలో యూపీఏ పాలకులు తీవ్రంగా విఫలమయ్యారు. దాని కారణంగానే 2009, 2014 ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఇతర దేశాలకు తరలించారు. ఆ సమయంలో దేశంలో ఎన్నికలు ఉ‍న్నందున రెండిటినీ నిర్వహించే దమ్ము కాంగ్రెస్‌కు లేకపోయింది. దాని కారణంగా అత్యంత అదరణ కలిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం మన యువత కోల్పోయింది’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక వైపు ఎన్నికలను, మరోవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తమదేనని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాక నవరాత్రి,  శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి వంటి ఉత్సవాలను సైతం ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు.

పదేళ్ల యూపీఏ పాలనలో ఏదీ కూడా ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. కాగా 2009లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరుతున్న కారణంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని, మ్యాచ్‌లను ఇతర దేశానికి తరలించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఏడాది ఐపీఎల్‌ను దక్షిణాఫ్రీకాలో నిర్వహించారు. ఇదే కారణంతో 2014 ఎన్నికల సమయంలో కూడా కొన్ని మ్యాచ్‌లను తరలించాల్సి వచ్చింది. ఎన్నికల కారణంగా ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ను తరలిస్తారని ప్రచారం జరిగినా.. ఎన్నికలు, ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఒకేసారి నిర్వహిస్తున్నారు.

Videos

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?