amp pages | Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ పోరుబాట

Published on Sun, 06/28/2020 - 04:13

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఉత్తమ్‌ రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ ట్రైనింగ్‌ సెల్‌ ఇన్‌చార్జి సచిన్‌ రావ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలకు నిరసనగా ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కరోనా వైరస్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన కరెంటు బిల్లులను నిరసిస్తూ జూలై 3న నల్ల బ్యాడ్జీలతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్‌ గౌడ్, బొల్లు కిషన్, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌లతో కూడిన ఒక కమిటీని కూడా ఉత్తమ్‌ ప్రకటించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌