amp pages | Sakshi

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

Published on Mon, 11/19/2018 - 16:27

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో నేటి(సోమవారం)తో నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీలతో రోడ్‌ షోలు నిర్వహిస్తామంటూ రాష్ట్ర నాయకత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నలభై మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలోని నేతలు పలు దఫాల్లో, పలు ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపింది.

స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, గులాం నబీ ఆజాద్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ, మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌, టీమిండియా మాజీ సారథి అజరుద్దీన్‌లతో పాటు పలువురు సీనియర్‌ నాయకుల(ముఖ్యంగా కన్నడిగులు)కు చోటు కల్పించారు. ఇక... రాష్ట్ర నాయకుల్లో సనత్‌నగర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ మర్రి శశిధర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  రాములు నాయక్‌, కె. జానారెడ్డి, మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, రేవంత్‌రెడ్డి తదితరులు స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచార రంగంలోకి దిగనున్నారు. కాగా బీజేపీ కూడా నలభై మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా
1. రాహుల్‌ గాంధీ
2. సోనియా గాంధీ
3. మన్మోహన్‌ సింగ్‌
4. గులాం నబీ ఆజాద్‌
5. మల్లికార్జున ఖర్గే
6. వి. నారాయణసామి
7. అశోక్‌ చవాన్‌
8. జి. పరమేశ్వర
9. మీరా కుమార్‌
10. డీకే శివకుమార్‌
11. మహ్మద్‌ అజారుద్దీన్‌
12. విజయ శాంతి
13. సల్మాన్‌ ఖుర్షీద్‌
14. జ్యోతిరాదిత్య సింధియా
15. జైపాల్‌ రెడ్డి
16. ఆర్‌సీ కుంతియా
17. శ్రీనివాసన్‌ కృష్ణన్‌
18. సలీం అహ్మద్‌
19. బీఎస్‌ బోసురాజు
20. మర్రి శశిధర్‌ రెడ్డి
21. మధుయాష్కీ గౌడ్‌
22. దామోదర రాజనర్సింహ
23. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
24. రాములు నాయక్‌
25. కె. జానారెడ్డి
26. మహ్మద్‌ షబ్బీర్‌ అలీ
27. రేవంత్‌రెడ్డి
28. మల్లు భట్టివిక్రమార్క
29. పి. సుధాకర్‌ రెడ్డి
30. రేణుకా చౌదరి
31. డీకే అరుణ
32. వి. హన్మంతరావు
33. రాజ్‌ బబ్బర్‌
34. నదీం జావేద్‌
35. నగ్మా మెరార్జీ
36. ఖుష్బూ
37. నేరెళ్ల శారద
38. జైరాం రమేశ్‌
39. అనిల్‌ థామస్‌
40. నితిన్‌ రౌత్‌

Videos

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)