amp pages | Sakshi

టీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది

Published on Mon, 08/05/2019 - 20:37

సాక్షి, హైదరాబాద్: ‘సమగ్ర వేదిక’  పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను అధికారికంగా అనుసంధానం చేయడంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ శ్రావణ్‌ దాసోజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వేదిక పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని సేకరించి రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించిందని, డేటా గోప్యత రక్షణ చట్టం-2017, ఐటీ యాక్ట్‌లనే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని సైతం ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు. అధికారిక డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్‌ దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. గత నెల 5న హైదరాబాద్‌లో జరిగిన ఐసీఏఐ జాతీయ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ’సిటిజెన్‌ 360’ పేరిట సేకరించిన వివరాలను తెలియజేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. వివిధ విభాగాల ద్వారా పౌరులకు సంబంధించిన ప్రైవేట్‌ డేటా సేకరించినట్లు జయేశ్‌ రంజన్‌ అంగీకరించారని వారు ఆరోపించారు.

‘జయేశ్‌ రంజన్‌ చేసిన ప్రకటన ద్వారా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రహస్యంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తేలింది. ప్రజల అనుమతి లేకుండా ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్టాలను ఉల్లంఘించడమే’ అని శ్రవణ్‌ తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత, రహస్య డేటా సేకరణ చేయడం చట్టవ్యతిరేకమని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డాక్టర్‌ శ్రవణ్‌ కేంద్ర మంత్రిని కోరారు. ఏ ఏజెన్సీ ద్వారా ఈ డేటాను సేకరించారో వెల్లడించలేదని, ఆ ఏజెన్సీ దగ్గర డేటా గుట్టుగా ఉండదనే గ్యారెంటీ ఏముంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఈమెయిల్స్, పాస్‌వర్డ్‌లు, మొదలైవన్నింటినీ, పౌరుల ప్రతి డిజిటల్‌ లావాదేవీలను ప్రభుత్వం సేకరించిందని స్పష్టం అవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  పౌరుల సమాచారాన్ని గుట్టుగా సేకరించిన ప్రభుత్వం డేటాను ఎందుకు సేకరించిందో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగం 14, 21 అధికరణాల కింద పౌరుల కల్పించిన హక్కులకు ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందని శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మార్చిలో ఐటి గ్రిడ్‌ ఇండియా ప్రెవేట్‌ లిమిటెడ్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయాన్ని డాక్టర్‌ శ్రవణ్‌ గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ’సేవామిత్ర’ అనే యాప్‌ పేరుతో రాజకీయ అవసరాల కోసం టీడీపీ డేటా సేకరించిందన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘సిటిజన్‌-360 ‘ని దుర్వినియోగం చేయట్లేదని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్‌ కేసులో నిందితులపై కేసులు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మాత్రం అదే తరహా నేరానికి పాల్పడి పౌరుల డేటాను చోర్యం చేస్తున్నట్లు అనుమానాలున్నాయియని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని, లేకపోతే, తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని శ్రవణ్‌ విలేకరులతో తెలిపారు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)