amp pages | Sakshi

గుండేగాంపై ప్రభుత్వానికి పట్టింపేది?

Published on Mon, 07/09/2018 - 13:05

భైంసా(ముథోల్‌): గుండేగాం గ్రామస్తుల పునరావాసంపై ప్రభుత్వానికి పట్టింపులేదని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం భైంసాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్సికర్‌ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గుండేగాం, పాతమహాగాం, చింతల్‌బోరి గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిసినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గతేడాది గుండేగాం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకువచ్చిందని, ఈఏడాది మళ్లీ అదే పరిస్థితి ఎదురైందన్నారు. అయినా.. అధికారుల్లో చలనంలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ముంపునకు గురయ్యే గ్రామాలు, నీట మునిగే పంటపొలాలను గుర్తించి పరిహారం చెల్లించాల్సిన కనీస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

మూడు రోజులుగా గుండేగాం గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారని, గ్రామంలోకి పాములు, అడవి పందులు వస్తున్నాయన్నారు. గుండేగాం గ్రామస్తులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా ముంపు బాధితులు, పునరావాస గ్రామాల వారికి పరిహారం ఇప్పించడంలో విఫలమవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రానున్నరోజుల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తీరుస్తామన్నారు. గుండేగాం గ్రామస్తులకు పునరావాసం కల్పించి నీటమునిగే పంటపొలాలకు పరిహారం చెల్లించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)