amp pages | Sakshi

డీఎస్సీ పేరుతో వ్యాపారం చేస్తున్నారన్నా

Published on Thu, 07/19/2018 - 09:21

తూర్పుగోదావరి : ప్రతి విద్యా సంవత్సరం నిర్వహించాల్సిన డీఎస్సీని ఏళ్ల తరబడి నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని నెలకో టెట్‌ పెట్టడం తప్ప డీఎస్సీ నిర్వహించడం లేదని డీఎడ్‌ అభ్యర్థులు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ రూరల్‌ చీడిగ వచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బి. సత్యనారాయణ శర్మ, ఎన్‌.శివ దుర్గాప్రసాద్, బి.మీనా, ఎం.శివ ప్రసాద్‌ తదితరులు కలిసి తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. రెండేళ్ల డీఎడ్‌ కోర్సులు పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదరుచూస్తున్నామని, అయినా తమ సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని మా భవిష్యత్తు అంధకారంగా మారిందని వాపోయారు.

ఏడాదికి ఒకసారి నిర్వహించాల్సిన డీఎస్సీని నిర్వహించకుండా అర్హత పరీక్ష టెట్‌ను మాత్రం నెలకు ఒకటి నిర్వహిస్తూ విద్యార్థులను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దఫాలు టెట్‌ నిర్వహించడం వల్ల అధికార పార్టీకి చెందిన కార్పొరేట్‌ సంస్థలు కోచింగ్‌ల పేరుతో రూ.లక్షలు దండుకుంటున్నారని వాపోయారు. గత ఏడాది నుంచి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీకి ముందు నిర్వహిస్తున్న టెట్‌ పరీక్షను రద్దు చేసి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని వారు కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన చేయడానికి డీఎడ్‌ చేసిన అభ్యర్థులను మాత్రమే అనుమతించాలని వారితోనే ఎస్‌జీటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

పాఠశాలల్లో గుణాత్మక విద్యను బలోపేతం చేయడానికి ఏటా కేలండర్‌ ఇయర్‌ ప్రకటించి దాని ప్రకారం డీఎస్సీ నిర్వహించాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ, కళావిద్యను బోధించే ఉపాధ్యాయులను నియమించాలని, మూసేసిన అన్ని పాఠశాలలను తెరిపించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ వారిని అనుమతించడం వల్ల తాము నష్టపోతున్నామని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుని, ఎస్‌జీటీ పోస్టులకు కేవలం డీఎడ్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా నిర్ణయించాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

 

Videos

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌